సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 12:35:39

ఢిల్లీలో ఇటలీ పర్యాటకులు.. 15 మందికి కరోనా

ఢిల్లీలో ఇటలీ పర్యాటకులు.. 15 మందికి కరోనా

న్యూఢిల్లీ : భారత పర్యటనకు వచ్చిన 15 మంది ఇటలీ దేశస్థులకు కరోనా వైరస్‌ సోకింది. కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న వీరి రక్త నమూనాలను సేకరించి.. పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. ఈ పదిహేను మందికి కరోనా సోకినట్లు పుణె ల్యాబ్‌ నిర్ధారించింది. దీంతో 15 మంది పర్యాటకులను ఢిల్లీలోని చావ్లా ఐటీబీపీ కేంద్రానికి తరలించారు. 15 మందిలో ఒక భారతీయుడు ఉన్నారు. ఇటలీ పర్యాటకుల గ్రూపులో ఇండియన్‌ కూడా ఉన్నారు. వీరిని 14 రోజుల పాటు పరిశీలనలో ఉంచనున్నారు. భారత పర్యటన కోసం ఇటలీ నుంచి మొత్తం 23 మంది పర్యాటకులు గత నెలలో రాజస్థాన్‌కు వచ్చారు. అయితే మొదట ఒకరికి మాత్రమే కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆయన భార్యతో పాటు మిగతా వారికి ఈ వైరస్‌ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. 

వైరస్‌ సోకిన వారి సంఖ్య ఇండియాలో 21కి చేరింది. 21 మందిలో 14 మంది ఇటలీ పర్యాటకులు, ఒక ఇండియన్‌(ఇటలీ పర్యాటకుల గ్రూపులో ఉన్న వ్యక్తి), ముగ్గురు కేరళ వాసులు, ఒకరు ఢిల్లీ, ఒకరు ఆగ్రా, మరొకరు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. కేరళలోని ముగ్గురు వ్యక్తులు కరోనా వైరస్‌ నుంచి ఉపశమనం పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 


logo