మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 07, 2020 , 23:00:04

కేర‌ళ‌ విమాన ప్ర‌మాదంలో 15 మంది మృతి

కేర‌ళ‌ విమాన ప్ర‌మాదంలో 15 మంది మృతి

తిరువ‌నంత‌పురం : కేర‌ళ కోజీకోడ్‌లో జ‌రిగిన ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో 15 మంది చ‌నిపోయారు. వీరిలో ఇద్ద‌రు పైల‌ట్లు ఉన్నారు. మ‌రో న‌లుగురు వ్య‌క్తులు ఇంకా విమానంలో చిక్కుకుని ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 50 మంది గాయ‌ప‌డ‌గా వీరిలో 15 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా ఎయిరిండియా విమానం దుబాయ్ నుంచి కేర‌ళ కోజికోడ్‌లోని క‌రిపూర్ విమానాశ్ర‌యానికి శుక్ర‌వారం రాత్రి 7.40 గంట‌ల‌కు చేరుకుంది. కాగా ల్యాండింగ్ స‌మయంలో విమానం అదుపుత‌ప్పి ర‌న్‌వేపై క్రాష్ అయింది. ఈ ప్ర‌మాదంలో విమానం రెండు ముక్క‌లు అయింది. సంఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.


logo