శనివారం 04 జూలై 2020
National - Jun 19, 2020 , 13:10:57

వీటిని పాటిద్దాం... కోవిడ్‌-19పై విజయం సాధిద్దాం

వీటిని పాటిద్దాం... కోవిడ్‌-19పై విజయం సాధిద్దాం

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలసిందే. వ్యాధి భారిన పడకుండా ప్రస్తుతానికి స్వీయ జాగ్రత్త చర్యలే శ్రీరామ రక్షగా ఉంటున్నాయి. కోవిడ్‌-19పై విజయానికి కీలకమైన 15 ప్రవర్తనల నియమావళిని పాటించాల్సిందిగా ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. ప్రతి ఒక్కరు ఈ పద్దతులను అవలంభించాల్సిందిగా తెలిపాయి. ప్రవర్తనా నియమావళి ఈ విధంగా ఉంది. 

1. ఎదుటి వ్యక్తిని కలిసినప్పుడు చేయి కలపకుండా.. భారతీయ సాంప్రదాయంను అనుసరించి నమస్కరించడం శ్రేయస్కరం

2. భౌతిక దూరం పాటించడం

3. తిరిగి ఉపయోగించేలా ఉండే మొఖాన్ని కప్పిఉచ్చే విధంగా ఉండే ఫేస్‌ మాస్కులు ధరించడం

4. కండ్లు, ముక్కు, నోరును తాకకుండా ఉండటం 

5. శ్వాసకోశ పరిశుభ్రతను పాటించడం

6. తరుచుగా చేతులను శుభ్రపరుచుకోవడం

7. పోగాకు, ఖైనీ ఉత్పత్తులను వాడకుండా ఉండటం

8. ఇంటిని తరచుగా శుభ్రం చేస్తూ క్లీన్‌గా ఉంచుకోవడం ‚

9. అనవసర ప్రయాణాలు చేయకుండా ఉండటం

10. ఏవరిపట్ల వివక్షను చూపొద్దు

11. సమూహం నుంచి దూరంగా జరగడం.. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం

12. సోషల్‌ మీడియా పోస్టులను సరిచూసుకోకుండా ఇతరులకు పంపిచడం

13. నమ్మదగ్గ సాధనాల నుంచే కోవిడ్‌-19కు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం

14. ఏమైనా సందేహాలు ఉంటే నేషనల్‌ టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1075 కు లేదా రాష్ట్ర హెల్ప్‌లైన్‌ నంబర్‌ 104కు కాల్‌ చేసి నివృత్తి చేసుకోవడం

15. ఆతృతగా కానీ, ఒత్తిడిలో గానీ ఉంటే మానసిక నిపుణుల సహాయాన్ని తీసుకోవడం. 


logo