శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 18:50:38

ఢిల్లీలో 1.20 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

ఢిల్లీలో 1.20 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు వెయ్యికి త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. శుక్ర‌వారం కూడా కొత్త‌గా 1462 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో అక్క‌డ న‌మోదైన‌ మొత్తం కేసుల సంఖ్య 1,20,107కు చేరింది. మొత్తం కేసుల‌లో 99,301 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 17,235 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారంతా ఢిల్లీలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో, హోం క్వారెంటైన్‌లో ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. 

ఇక ఢిల్లీలో మ‌ర‌ణాలు కూడా క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నాయి. శుక్ర‌వారం కొత్త‌గా 26 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 3,571కి చేరింది. ఢిల్లీ ప్ర‌భుత్వం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.                ‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo