శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 15:12:02

నార్త్‌ గోవాలో 144 సెక్షన్‌..ఖాతరు చేయకుంటే కఠిన చర్యలు

నార్త్‌ గోవాలో 144 సెక్షన్‌..ఖాతరు చేయకుంటే కఠిన చర్యలు

 దేశ ప్రజలను కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడటం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా మార్చి 22న అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని  ప్రధాని మోదీ ఇప్పటికే దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. తాజాగా గోవా సర్కారు రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించింది. ఎవరైనా రూల్స్‌ను అతిక్రమిస్తే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 188 ప్రకారం శిక్షింపబడుతారని హెచ్చరించింది. 


144 సెక్షన్‌ అమల్లోకి వచ్చినందున నార్త్‌ గోవా ప్రజలెవరూ రోడ్లపై ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని.. ఎలాంటి బహిరంగసభల నిర్వహణకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించారు. ఇదిలావుంటే, శనివారం మధ్యాహ్నానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 271కి చేరిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకటించింది.       


logo