బుధవారం 03 జూన్ 2020
National - May 19, 2020 , 21:14:11

ఒక్క రోజే 1411 పాజిటివ్ కేసులు..43 మంది మృతి

ఒక్క రోజే 1411 పాజిటివ్ కేసులు..43 మంది మృతి

ముంబై: ముంబైలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకీ తన ప్రతాపం చూపిస్తోంది. ప్రతీ రోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్క రోజే కొత్తగా 1411 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 43 మంది మృతి చెందినట్లు  బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

తాజా కేసులతో ముంబైలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,563కు చేరుకుంది. ముంబైలో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 800కు చేరినట్లు తెలిపారు. మ‌హారాష్ట్ర‌లో న‌మోదవుతున్న కేసుల్లో అత్య‌ధికంగా ముంబై నుంచే ఉంటున్న విషయం తెలిసిందే. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo