సోమవారం 25 మే 2020
National - Apr 06, 2020 , 21:09:35

లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘ‌న‌..1410 మంది అరెస్ట్‌

లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘ‌న‌..1410 మంది అరెస్ట్‌

ముంబై: క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌జ‌లు ఇండ్లలో నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఉండేలా ఎక్క‌డిక‌క్క‌డా స్వీయ నిర్బంధంలో ఉండేలా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయితే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న సూచ‌న‌లు ప‌ట్టించుకోకుండా కొంత‌మంది లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ బ‌యట తిరుగుతున్నారు. 

మ‌హారాష్ట్రలో లాక్ డౌన్ విధించిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు రూల్స్ ఉల్లంఘించిన  1410 మందిని అరెస్ట్ చేశామ‌ని ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ వెల్ల‌డించారు. అదేవిధంగా  7,570 వాహ‌నాల‌ను సీజ్ చేసిన‌ట్లు చెప్పారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వాహ‌న‌దారుల‌కు మొత్తం రూ.65,43,624 జ‌రిమానా విధించామ‌ని వెల్ల‌డించారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo