శుక్రవారం 05 జూన్ 2020
National - May 12, 2020 , 09:58:21

తండ్రి మీద కోపంతో బాలికను త‌గుల‌బెట్టిన ప్ర‌త్య‌ర్థులు

తండ్రి మీద కోపంతో బాలికను త‌గుల‌బెట్టిన ప్ర‌త్య‌ర్థులు

చెన్నై: త‌మిళ‌నాడులో దారుణం జ‌రిగింది. తండ్రి మీద కోపంతో ఇద్ద‌రు దుండ‌గులు అత‌ని 14 ఏండ్ల కూతురుపై పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ బాలిక‌ను ఆస్ప్ర‌త్రిలో చికిత్స పొందుతూ సోమ‌వారం రాత్రి మృతిచెందింది. వివ‌రాల్లోకి వెళ్తే.. వెల్లుపురం ప‌ట్ట‌ణ స‌మీపంలోని సిరిమదురాయ్ గ్రామానికి చెందిన కె.జ‌య‌బాల్‌, కే కుమార్ సోద‌రుల‌కు, నిందితుడు మురుగన్‌కు మ‌ధ్య ఒక ఎక‌రం భూమి విష‌య‌మై త‌గాదా న‌డుస్తున్న‌ది. 

ఈ నేప‌థ్యంలో ఆదివారం ఉద‌యం మురుగ‌న్ స్నేహితుడు జ‌య‌బాల్ కిరాణ దుకాణానికి సిగ‌రెట్ కొనే వంక‌తో వెళ్లి దుకాణంలో ఉన్న జ‌య‌బాల్ కుమారుడు జ‌య‌రాజ్ (17)పై దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై జ‌య‌బాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో మ‌రింత రెచ్చిపోయిన మురుగ‌న్ త‌న మ‌రో స్నేహితుడు క‌లియ‌పెరుమాల్‌తో క‌లిసి ఆదివారం సాయంత్రం ఇంటిబ‌య‌ట ఆడుకుంటున్న జ‌య‌బాల్ కూతురు జ‌య‌శ్రీ (14)పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. అనంత‌రం అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్ద‌రినీ అరెస్ట్ చేశారు.     

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo