ఆదివారం 24 జనవరి 2021
National - Jan 01, 2021 , 17:23:18

ఆర్మీ జవాన్ల అదుపులో పీవోకే బాలుడు

ఆర్మీ జవాన్ల అదుపులో పీవోకే బాలుడు

శ్రీనగర్‌: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)కు చెందిన ఒక బాలుడ్ని భారత ఆర్మీ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు దాటి పీవోకే నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించిన 14 ఏండ్ల బాలుడ్ని పూంచ్‌లోని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ గుర్తించింది. అజోట్ గ్రామం సమీపంలోని బతర్ నల్లా వద్ద అతడ్ని పట్టుకున్నది. పీవోకేకు చెందిన బాలుడు తమ అదుపులో ఉన్నట్లు పూంచ్‌ ఎస్‌ఎస్‌పీ రమేష్ అంగ్రాల్ తెలిపారు. అతడు పొరపాటున సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించి ఉంటాడని చెప్పారు. ఆ బాలుడి చొరబాటులో ఎలాంటి దురుద్దేశం లేనిపక్షంలో పాకిస్థాన్‌ అధికారులతో చర్చలు జరిపి అతడ్ని అప్పగిస్తామని వెల్లడించారు. 

కాగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) నుంచి సరిహద్దులు దాటి జమ్ముకశ్మీర్‌లోకి చిన్నారులు ప్రవేశించడం తరచుగా జరుగుతున్నది. గత నెలలో పీవోకేకు చెందిన ఇద్దరు మైనర్‌ బాలికలు పొరపాటున భారత్‌వైపునకు వచ్చారు. వారి గురించి తెలుసుకున్న సైనిక అధికారులు ఆ ఇద్దరు బాలికలకు బహుమతులు ఇచ్చి పీవోకేకు తిరిగి పంపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo