సోమవారం 06 జూలై 2020
National - May 26, 2020 , 11:54:12

ఆమెకు 9, అతనికి 14.. అత్యాచార యత్నం.. ఆపై హత్య

ఆమెకు 9, అతనికి 14.. అత్యాచార యత్నం.. ఆపై హత్య

చెన్నై : ఆ చిన్నారి వయసు తొమ్మిదేళ్లు.. అతని వయసు 14 ఏండ్లు. అభం శుభం తెలియని ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి.. అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలుడి అత్యాచార యత్నాన్ని చిన్నారి తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ తర్వాత బాలికను కొట్టి చంపాడు ఆ క్రూరుడు. ఈ ఘటన తమిళనాడులోని మణప్పరై పోలీసు స్టేషన్‌ పరిధిలోని కృష్ణసముద్రంలో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 

కృష్ణసముద్రం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఇదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడు.. చిన్నారిపై కన్నేశాడు. ఈ క్రమంలో చిన్నారికి మాయమాటలు చెప్పి గ్రామానికి సమీపంలో ఉన్న మల్లెపూల తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసేందుకు యువకుడు ప్రయత్నించాడు. అతని ఆగడాలను అడ్డుకుంది చిన్నారి. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన బాలుడు.. బాలిక తలపై బండరాయితో కొట్టాడు. చిన్నారి స్పృహ కోల్పోయింది.   

గ్రామంలోకి వచ్చిన అతను.. ఏమీ తెలియనట్లు చిన్నారి అపస్మారక స్థితిలో ఉందని స్థానికులకు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించి.. బాలుడిని విచారించారు. తనకేమీ తెలియదన్నట్లు బాలుడు పోలీసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు యత్నించాడు. కానీ పోలీసుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయి.. చేసిన నేరాన్ని అంగీకరించాడు అతను. చిన్నారిని హత్య చేసిన బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్‌ హోంకు తరలించారు పోలీసులు. 


logo