ఆదివారం 12 జూలై 2020
National - Jun 30, 2020 , 19:15:46

ఇండో-టిబెటన్‌ పోలీసుల్లో కొత్తగా 14మందికి కరోనా

ఇండో-టిబెటన్‌ పోలీసుల్లో కొత్తగా 14మందికి కరోనా

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ కల్లోలం సృష్టిస్తోంది. మంత్రులను, అధికారులను, పోలీసులను ఎవ్వరిని వదలడం లేదు. లాక్‌డౌన్‌ విధుల నిర్వర్తిస్తున్న పోలీసులు చాలామంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే చాలామంది పోలీసులు కరోనాతో పోరాడుతుండగా తాజాగా ఆ జాబితాలోకి ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసులు (ఐటీబీపీ) చేరారు.

ఇప్పటి వరకు 94మంది ఐటీబీటీ పోలీసులు కరోనా బారినపడిగా వీరిలో 23 మంది ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న వారే. మిగిలిన 71మంది వివిధ ప్రాంతాలకు చెందిన వారిని ఉన్నతాధికారులు తెలిపారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.  కరోనా బారినపడుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతుండడంపై ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందని, వైరస్‌ ప్రబలకుండా మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచిస్తున్నారు.


logo