శనివారం 30 మే 2020
National - May 16, 2020 , 15:55:37

శ్రామిక్ రైళ్ల‌లో 14 ల‌క్ష‌ల మంది త‌ర‌లింపు

శ్రామిక్ రైళ్ల‌లో 14 ల‌క్ష‌ల మంది త‌ర‌లింపుహైద‌రాబాద్‌: లాక్‌డౌన్ వ‌ల్ల వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న‌వారిని త‌ర‌లించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం శ్రామిక్ రైళ్ల‌ను న‌డుపుతున్న విష‌యం తెలిసిందే.  అయితే ఈనెల 15వ తేదీ అర్థ‌రాత్రి వ‌ర‌కు శ్రామిక్ రైళ్ల‌లో సుమారు 14 ల‌క్ష‌ల మందిని త‌ర‌లించిన‌ట్లు రైల్వేశాఖ పేర్కొన్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు 1074 శ్రామిక్ రైళ్ల‌ను న‌డిపారు. గ‌త మూడు రోజుల్లో దేశ‌వ్యాప్తంగా సుమారు రెండు ల‌క్ష‌ల మంది శ్రామిక్ రైళ్ల‌లో ప్ర‌యాణించిన‌ట్లు రైల్వేశాఖ వెల్ల‌డించింది. వివిధ రాష్ట్రాల నుంచి వ‌ల‌స కూలీలు ఈ రైళ్ల ద్వారా యూపీ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల‌కు వెళ్తున్న విష‌యం తెలిసిందే.


logo