గురువారం 26 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 07:38:59

ట్ర‌క్కును ఢీకొన్న జీపు.. 14 మంది మృతి

ట్ర‌క్కును ఢీకొన్న జీపు.. 14 మంది మృతి

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ప్రయాగ్‌రాజ్‌-ల‌క్నో ర‌హాద‌రిపై ట్రక్కును ఓ టీపు ఢీకొట్ట‌డంతో 14 మంది మృతిచెందారు. మ‌ర‌ణించిన‌వారిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్ర‌యాగ్‌రాజ్‌-లక్నో హైవేపై వెళ్తున్న ఓ జీవు ప్ర‌తాప్‌గ‌ఢ్ స‌మీపంలో నిన్న అర్థ‌రాత్రి ట్ర‌క్కును ఢీకొట్టింది. దీంతో అందులో ప్ర‌యాణిస్తున్న 14 మంది మ‌ర‌ణించారు. మ‌రికొంద‌రు గాయ‌పడ్డారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. 

ప్రతాప్‌గ‌ఢ్ రోడ్డు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ఉన్న‌తాధికారులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. బాధితుల‌కు మెరుగైన వైద్యం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు.