ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 17:09:10

జువైన‌ల్ హోం నుంచి 14 మంది ప‌రార్

జువైన‌ల్ హోం నుంచి 14 మంది ప‌రార్

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మధుర జువైన‌ల్ హోం నుంచి 14 మంది బాలురు పారిపోయారు. ఈ ఘ‌ట‌న గురువారం తెల్ల‌వారుజామున 2:30 గంట‌ల స‌మ‌యంలో చోటు చేసుకుంది. వివిధ నేరాల‌కు పాల్ప‌డిన‌ ఓ 14 మంది బాలురు హోం నుంచి పారిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ప‌క్కా ప్రణాళిక ప్ర‌కారం.. బుధ‌వారం అర్ధ‌రాత్రి ప‌డుకున్నాక‌.. మెల్ల‌గా కిటికీల గ్రిల్స్ ను తొల‌గించారు. ఆ త‌ర్వాత 14 మంది అక్క‌డ్నుంచి జంప్ అయ్యారు. బాలురు పారిపోయిన విష‌యాన్ని అక్క‌డున్న సెక్యూరిటీ గార్డు గ్ర‌హించి పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేశాడు. 

మ‌ధుర అడిష‌నల్ ఎస్పీ ఉద‌య్ శంక‌ర్ సింగ్‌.. పోలీసులను హోం వ‌ద్ద‌కు పంపాడు. రాత్రికి రాత్రే య‌మునా న‌దీ తీరంలో పోలీసులు త‌నిఖీలు చేయ‌గా 9 మంది ప‌ట్టుబ‌డ్డారు. వారిని తిరిగి జువైన‌ల్ హోంకు త‌ర‌లించారు. మిగ‌తా వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హోంలో ఉంటున్న ఇద్ద‌రిని జైలుకు త‌ర‌లించారు. వారిద్ద‌రి 18 ఏళ్ల వ‌య‌సులోకి అడుగు పెట్టినందున జైలుకు త‌ర‌లించిన‌ట్లు పోలీసులు తెలిపారు. వీరిద్ద‌రూ క‌లిసి మిగ‌తా వారికి పారిపోయేందుకు ప్లాన్ ఇస్తున్నార‌ని చెప్పారు. 

ఈ ఏడాది మార్చి నెల‌లో కూడా ఐదుగురు హోం నుంచి త‌ప్పించుకున్నారు. హోంగార్డును కొట్టి వారు పారిపోతే.. మ‌ళ్లీ ప‌ట్టుకొచ్చి హోంలో నిర్బంధించారు. 


logo