గురువారం 28 మే 2020
National - May 10, 2020 , 20:24:26

ప‌శ్చిమ‌బెంగాల్ లో ఒక్క రోజే 14 మంది మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ లో  ఒక్క రోజే 14 మంది మృతి

కోల్ క‌తా: పశ్చిమ‌బెంగాల్ లో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ ఒక్క రోజే 153 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 14 మంది మృతి చెందార‌ని, దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో చనిపోయిన వారి సంఖ్య 113కు చేరుకుందని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. రాష్ట్రంలో న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1939కు చేరు‌కుంది.

పశ్చిమబెంగాల్ లో నిన్న ఒక్క రోజే 11 మంది క‌రోనాతో ప్రాణాలు విడిచిన విష‌యం తెలిసిందే. కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కంటైన్ మెంట్ జోన్ల‌లో పోలీసులు లాక్ డౌన్ రూల్స్ క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. నిత్య‌వ‌స‌ర స‌రుకులు, ఇత‌ర సామాగ్రి ఇంటివ‌ద్ద‌కే పంపిణీ చేస్తున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo