బుధవారం 08 జూలై 2020
National - Jun 28, 2020 , 17:05:26

అస్సాంలో రేపటి నుంచి మళ్లీ లాక్‌డౌన్

అస్సాంలో రేపటి నుంచి మళ్లీ లాక్‌డౌన్

గువాహటి : అస్సాంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నేటి అర్థరాత్రి నుంచి 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించనున్నారు. దీంతో అక్కడి ప్రజలు నిత్యావసరాలు, పండ్లు, కూరగాయలు ముందుగానే  కొనుగోలు చేస్తున్నారు. ప్రధాన కేంద్రాల్లో లాక్‌డౌన్‌ ముందురోజు కావడంతో జనం భారీగా కొనుగోళ్లు జరుపుతున్నారు. అయితే లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వం యోచిస్తోంది. అస్సాంలో ఇప్పటి వరకు 7165 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో4815 మంది డిశ్చార్జి కాగా 2093 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 10 మంది మృతి చెందినట్లు తెలిసింది. 
logo