మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 18:48:36

సీఎం కీలక నిర్ణయం.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తే క్వారంటైన్ తప్పనిసరి

సీఎం కీలక నిర్ణయం.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తే క్వారంటైన్ తప్పనిసరి

చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ శుక్రవారం అధికారులతో వీడియో కార్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి 14 రోజుల హోం క్వారంటైన్ నిబంధనను కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పంజాబ్ కు రావాలనుకునే ఇతర రాష్ట్రాల వారు దీని కోసం ఏర్పాటు చేసిన కోవా యాప్ లో స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని పూర్తి చేయాలని చెప్పారు. దీంతో ప్రయాణ అనుమతిలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. మరోవైపు కరోనా సోకిన వారిని గుర్తించేందుకు వచ్చేవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా  ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.logo