గురువారం 09 జూలై 2020
National - Jun 29, 2020 , 11:46:25

గౌహతిలో 14 రోజుల లాక్‌డౌన్‌ మొదలు

గౌహతిలో 14 రోజుల లాక్‌డౌన్‌ మొదలు

గౌహతి: అసోంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో సోమవారం నుంచి పూర్తిగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. దీంతో కామ్‌రూప్‌ జిల్లాలో జన జీవనం పూర్తిగా స్తంభించింది. మరోసారి లాక్‌డౌన్‌ విధించడంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో ఎప్పుడు జన రద్దీగా ఉండే గౌహతి నగరంలోని రహదారులు సోమవారం బోసిపోయాయి. జన సంచారం లేక నగర వీధులు నిర్మానుష్యంగా మారాయి. 

మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. జనం ఇండ్ల నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. కామ్‌రూప్‌ జిల్లాలో పూర్తి లాక్‌డౌన్‌ను 14 రోజులపాటు అమలు చేయనున్నారు. మిగతా ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూను రాత్రి 8 గంటల నుంచి అమలు చేస్తున్నారు. అసోంలో మొత్తం కరోనా కేసులు 6,600పైగా నమోదు కాగా, ఇప్పటి వరకు 9 మంది మరణించారు. 
logo