శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 07:33:58

వంటింట్లో 14 నాగుపాము పిల్లలు

వంటింట్లో 14 నాగుపాము పిల్లలు

భువనేశ్వర్‌ : జాజ్‌పూర్‌ జిల్లా సారంగపూర్‌ గ్రామంలోని ఓ వ్యక్తి ఇంట్లోని వంట గదిలో 14 నాగుపాము పిల్లలు దర్శనమిచ్చాయి. స్థానికుల వివరాల ప్రకారం.. సారంగపూర్‌కు చెందిన పద్మలోచన మహింది అనే వ్యక్తి ఇంట్లో నాగుపాము సంచరిస్తుండడం చూసి  కుటుంబ సభ్యులు భయంతో ఇంటి నుంచి బయటికి పరుగులు తీశారు. వారు స్పేక్‌హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించడంతో హెల్ప్‌లైన్‌ సభ్యులు పద్మలోచన ఇంటిని పరిశీలించారు. వంటింట్లోని గ్యాస్‌ సిలిండర్‌ కింద ఉన్న ఓ రంధ్రంలో నాగుపాము పిల్లలు ఉన్నట్లు వారు గుర్తించారు.

ఆ రంధ్రం ఉన్న ప్రాంతాన్ని తవ్వగా అందులో 14 నాగుపాము పిల్లలు దర్శనమిచ్చాయి. దీంతో హెల్ప్‌లైన్‌ వాళ్లు ఆ పాములను పట్టుకొని అడవిలో వదిలేశారు. కానీ పెద్ద వాము మాత్రం దొరకలేదు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo