మహారాష్ట్రలో ఒక్కరోజే 295 కరోనా మరణాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. కొత్త కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం కూడా కొత్తగా 14,888 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,18,711కు చేరింది. అందులో ఇప్పటికే 5,22,427 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 1,72,873 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక కరోనా మరణాలు కూడా మహారాష్ట్రలో భారీగానే నమోదవుతున్నాయి. శనివారం కూడా కొత్తగా 295 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 22,794కు చేరింది. మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మోసాలకు పాల్పడుతున్న ముఠాల అరెస్ట్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- లగ్జరీ కారులో రయ్యిమంటూ దూసుకుపోతున్న అల్లు అర్జున్
- ఆన్లైన్లో భద్రాద్రి రామయ్య కల్యాణం టికెట్లు
- ఇక స్కూళ్లల్లోనూ ఇంటర్ పరీక్ష కేంద్రాలు
- లాస్యతో కుమార్ సాయి స్టెప్పులు... వీడియో వైరల్
- తిరుపతి మార్గంలో 18 రైళ్లు రద్దు: ఎస్సీఆర్
- పదేండ్ల తర్వాత టీటీడీ కల్యాణమస్తు
- నేడు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ.. తొలి విడత అభ్యర్థుల ప్రకటన!
- స్నేహితురాలి పెళ్లిలో తమన్నా సందడి మాములుగా లేదు