శనివారం 31 అక్టోబర్ 2020
National - Aug 27, 2020 , 20:12:07

మహారాష్ట్రలో కొత్తగా 14,718 పాజిటివ్ కేసులు.. 355 మరణాలు

మహారాష్ట్రలో కొత్తగా 14,718 పాజిటివ్ కేసులు.. 355 మరణాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తీవ్రంగానే ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతి రోజు పది వేలకుపైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 14,718 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 355 మంది మరణించారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,33,568కి, మరణాల సంఖ్య 23,444కి చేరింది. కాగా, ఇప్పటి వరకు 5,31,563 మంది కరోనా రోగులు కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 1,78,234 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.