మంగళవారం 02 మార్చి 2021
National - Jan 23, 2021 , 10:12:02

గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్‌ కేసులు

గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్‌ కేసులు

న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో 14,256 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,06,39,684కు చేరింది. తాజాగా వైరస్‌ నుంచి 17,130 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. ఇప్పటి వరకు 1.03కోట్ల మంది కోలుకున్నారని కేంద్రం తెలిపింది. మరో 152 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా.. మృతుల సంఖ్య 1,53,184కు పెరిగిందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో 1,85,662 క్రియాశీల కేసులు ఉన్నాయని పేర్కొంది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 13,90,259 మందికి వేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది.

VIDEOS

logo