బుధవారం 27 మే 2020
National - May 11, 2020 , 10:57:41

భోపాల్ చేరుకున్న 1383 మంది వ‌ల‌స కూలీలు

భోపాల్ చేరుకున్న 1383 మంది వ‌ల‌స కూలీలు

భోపాల్‌: లాక్‌డౌన్ కార‌ణంగా ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని ప్ర‌త్యేక శ్రామిక్ రైళ్ల ద్వారా స్వ‌రాష్ట్రాల‌కు త‌ర‌లించే ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. ఇందులో భాగంగా గుజ‌రాత్‌లో చిక్కుకున్న‌ 1383 మంది వ‌ల‌స కూలీలు తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌కు చేరుకున్నారు. గుజ‌రాత్‌లోని మోర్బి నుంచి ప్ర‌త్యేక శ్రామిక్ రైలులో వీరిని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు త‌ర‌లించారు. ఆ 1383 మందిని ప్ర‌త్యేక బ‌స్సుల ద్వారా వారివారి సొంత జిల్లాల‌కు త‌ర‌లించ‌నున్న‌ట్లు భోపాల్ స‌బ్‌డివిజిన‌ల్ మెజిస్ట్రేట్ రాజేష్ గుప్తా తెలిపారు.     


logo