బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 11:33:07

మ‌హారాష్ట్ర‌లో 138 మంది పోలీసుల‌కు క‌రోనా.. ముగ్గురు మృతి

మ‌హారాష్ట్ర‌లో 138 మంది పోలీసుల‌కు క‌రోనా.. ముగ్గురు మృతి

ముంబై: మ‌హారాష్ట్ర‌లో గ‌త 24 గంట‌ల్లో 138 మంది పోలీసులకు క‌రోనా సోకింది. మ‌రోవైపు క‌రోనా పాజిటివ్ పోలీసుల్లో ముగ్గురు మ‌ర‌ణించారు. దీంతో వైర‌స్ వ‌ల్ల చ‌నిపోయిన వారి సంఖ్య 97కు చేరింది. మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 8,722 మంది పోలీసులు క‌రోనా బారిన‌ప‌డ్డారు. 1,955 మంది ఇంకా చికిత్స పొందుతుండ‌గా 6,670 మంది పోలీసులు కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ది. దీంతో క‌రోనా పోరులో ముందున్న పోలీసులు కూడా వైర‌స్ బారినప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసుల‌కు చికిత్స కోసం ముంబై పోలీస్ శాఖ ప్ర‌త్యేక క్వారంటైన్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది.logo