గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 17:02:29

138 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్‌

138 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్‌

ముంబై: దేశంలో క‌రోనా అన‌గానే మ‌హారాష్ట్ర గుర్తొస్తుంది. క‌రోనా కేంద్రంగా మారిన రాష్ట్రంలో సాధార‌ణ ప్ర‌జ‌ల‌తోపాటు, వారికి ర‌క్ష‌ణగా నిలిచి, మ‌హ‌మ్మారిపై ముందుండి పోరాడిన పోలీసులు కూడా అంతేసంఖ్య‌లో క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. తాజాగా మ‌హారాష్ట్ర‌లో గ‌త 24 గంట‌ల్లో 138 మంది పోలీసులు క‌రోనాబారిన ప‌డ‌గా, ఇద్ద‌రు మ‌ర‌ణించారు. దీంతో మొత్తం 9096 మంది పోలీసుల‌కు క‌రోనా సోకింద‌ని మ‌హారాష్ట పోలీస్ శాఖ ప్ర‌క‌టించింది. ఇందులో 1912 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 7084 మంది పోలీసులు కోలుకున్నారు. 

రాష్టంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,46,433 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 2,39,755 మంది కోలుకున్నారు, మ‌రో 14,,463 మంది చ‌నిపోయారు. దేశంలో గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 52,123 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,83,792కు చేరింది.


logo