బుధవారం 03 జూన్ 2020
National - May 07, 2020 , 21:13:14

మహారాష్ట్రలో ఒక్కరోజే 1362 మందికి కరోనా

మహారాష్ట్రలో ఒక్కరోజే 1362 మందికి కరోనా

ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రతిరోజు వెయ్యికి పైగానే కేసులు నమోదవుతున్నాయి. గురువారం కొత్తగా 1362 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,120కి చేరింది. మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోపే ఈ వివరాలను వెల్లడించారు. ముంబైలోని మురికివాడ ధారవిలో సైతం గురువారం కొత్తగా 50 కేసులు నమోదయ్యాయని, దీంతో అక్కడ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 783కు చేరిందని మంత్రి తోపే తెలిపారు. ధారవిలో మరణాల సంఖ్య కూడా ఇప్పటివరకు 21కి చేరిందని ఆయన వెల్లడించారు. 


logo