శనివారం 06 జూన్ 2020
National - May 22, 2020 , 20:58:32

పశ్చిమబెంగాల్‌లో కొత్తగా 135 కరోనా కేసులు

పశ్చిమబెంగాల్‌లో కొత్తగా 135 కరోనా కేసులు

కోల్‌కతా: అంఫాన్‌ తుఫాన్‌తో అతలాకుతలమైన పశ్చిమబెంగాల్‌లో ఈ రోజు కొత్తగా 135 కరోనా కేసులు నమోదవగా, ఆరుగురు బాధితులు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3322కి పెరిగింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో ఇప్పటివరకు 199 మంది మృతిచెందారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 1249 కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 1846 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ రోజు 5,355 నమూనాలను పరీక్షించగా, 135 కరోనా పాజిటివ్‌లుగా తేలాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1,20,599 నమూనాలనుపరీక్షించారు.


logo