శుక్రవారం 05 జూన్ 2020
National - May 16, 2020 , 18:47:00

కోలుకున్న 135 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

కోలుకున్న 135 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారి నుంచి బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) తేరుకుంటున్నది. శనివారం 135 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు.  వారిలో ఇప్పటి వరకు 98 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 37 మంది డిశ్చార్జి కానున్నారు. అయితే డిశ్చార్జి అయిన 98 మందిలో 42 మంది జోధ్‌పూర్‌ నుంచి, 31 మంది త్రిపుర నుంచి, 25 మంది ఢిల్లీ నుంచి ఉన్నారు. బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు శనివారం సాయంత్రం ఈ వివరాలను వెల్లడించారు. వీరందరికీ కరోనా పాజిటివ్‌ రావడంతో ఇటీవల ఐసోలేషన్‌ కేంద్రాల్లో చేరి చికిత్స తీసుకున్నారు.  


logo