లక్నో: బాలుడిపై దాబా యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. (boy raped by dhaba owner) అక్కడి నుంచి తప్పించుకున్న అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పేదరికం, ఆకలితో బాధపడిన 13 ఏళ్ల బాలుడు తన గ్రామాన్ని విడిచి పట్టణానికి చేరుకున్నాడు. రాజేష్ అనే వ్యక్తికి చెందిన రాథోర్ దాబాలో పని చేస్తున్నాడు. అయితే గత మూడు రోజులుగా రాజేష్ రాత్రివేళ ఆ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. దీని గురించి ఎవరికీ చెప్పవద్దని అతడ్ని బెదిరించాడు.
కాగా, ఈ ఆరాచకాన్ని భరించలేకపోయిన ఆ బాలుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దాబా యజమాని రాజేష్‌పై ఫిర్యాదు చేశాడు. తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న దాబా యజమాని రాజేష్ కోసం వెతుకుతున్నారు.