బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 22, 2020 , 10:33:52

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 13 మంది పోలీసుల ఆచూకీ గల్లంతు

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 13 మంది పోలీసుల ఆచూకీ గల్లంతు

ఛత్తీస్‌గఢ్‌ :  చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కసల్పాడ్-ఎల్మాగూడ వద్ద నిన్న అర్థరాత్రి దాటిన తర్వాత మావోయిస్టులకు, డిస్ట్రిక్ట్ ఆర్ముడ్ రిజర్వు (డీఆర్జీ) విభాగానికి చెందిన పోలీసులకు మధ్య భీకర పోరు జరిగింది.  మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు చింతగుఫ, బుర్‌కాపాల్‌, టైమ్‌లావాడ క్యాంప్‌ ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, కమాండో బెటాలియన్‌ ఫర్‌ రెసల్యూట్‌ యాక్షన్‌(కోబ్రా)కు చెందిన భద్రతా సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది.  ఈ ఎన్‌కౌంటర్‌లో 14 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు.  మరో 13 మంది ఆచూకీ తెలియకుండా పోయింది.  గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం రాయపూర్ ఆస్పత్రికి తరలించారు. అటవీ ప్రాంతంలోనే ఇంకా 150 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు.logo
>>>>>>