సోమవారం 01 జూన్ 2020
National - May 18, 2020 , 10:44:17

13 మంది గర్భిణులకు కరోనా పాజిటివ్‌

13 మంది గర్భిణులకు కరోనా పాజిటివ్‌

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. అనంత్‌నాగ్‌ జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్‌. గత వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా 500ల మంది గర్భిణులకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 13 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇందులో ఏడు కేసులు రెడ్‌ జోన్‌ పరిధిలో నమోదు అయ్యాయి. ఈ క్రమంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

కరోనా వైరస్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ జరగకుండా వైద్యులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇప్పటి వరకు 1,180 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 13 మంది చనిపోయారు. గడిచిన రెండు రోజుల్లో జమ్మూకశ్మీర్‌లో 160 కేసులు నమోదు కాగా, శనివారం ఒక్కరోజే 108 కేసులు నమోదు అయ్యాయి. మొత్తంగా కరోనా సోకిన గర్భిణుల పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.


logo