సోమవారం 01 జూన్ 2020
National - May 13, 2020 , 15:47:13

బీఎస్ఎఫ్‌లో మ‌రో 13 క‌రోనా కేసులు

బీఎస్ఎఫ్‌లో మ‌రో 13 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: భ‌ద్ర‌తా బ‌ల‌గాల్లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌ది. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా మ‌రో 13 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కొత్తగా క‌రోనా బారిన‌ప‌డ్డ బీఎస్ఎఫ్  జ‌‌వాన్ల‌లో 11 మంది ఢిల్లీ విభాగానికి చెందినవారు కాగా, కోల్‌క‌తా, త్రిపుర‌కు చెందిన వారు ఒక్కొక్క‌రు చొప్పున ఉన్నారు. దీంతో బార్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో క‌రోనా సోకిన మొత్తం జ‌వాన్ల సంఖ్య 295కి చేరింది. బీఎస్ఎఫ్‌తోపాటు సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్ జ‌వాన్ల‌లోనూ క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo