ఆదివారం 31 మే 2020
National - May 09, 2020 , 17:25:03

మరో 13 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌

మరో 13 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ: భారత్‌లో సాయుధ దళాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 13 మంది సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్ఎఫ్) సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 543 మంది సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఏపీఎఫ్‌) సిబ్బందికి వైరస్‌ సోకింది.  కొత్తగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సిబ్బంది దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తుండగా వైరస్‌ బారినపడినట్లు సీఐఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు.   ఒక్క సీఐఎస్ఎఫ్‌లోనే 48 మందికి కరోనా సోకింది. 

సాయుధ బలగాల వారీగా కరోనా కేసుల సంఖ్య

సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌)-229

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)-163

ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ)-86

సీఐఎస్‌ఎఫ్‌-48

సహస్ర సీమా బల్‌-17


logo