మంగళవారం 31 మార్చి 2020
National - Mar 07, 2020 , 01:06:05

రోడ్డు ప్రమాదం.. 13 మంది బలి

రోడ్డు ప్రమాదం.. 13 మంది బలి

బెంగళూరు/ చెన్నై: కర్ణాటకలోని తుమ కూరు జిల్లాలో ఘోరం జరిగింది. రోడ్డు ప్రమాదం 13 మంది యాత్రికులను బలిగొన్నది. శుక్రవారం తెల్లవారు జామున తమిళనాడుకు చెందిన 12 మంది భక్తులు ఎస్‌యూవీ వాహనం లో ధర్మస్థలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. బెంగళూరుకు చెందిన నలుగురు మరో కారులో ధర్మస్థలకు వెళ్తున్నారు. తుమకూరు జిల్లా అమృథుర్‌ వద్ద కారు డివైడర్‌ను ఢీకొని.. రోడ్డు అవతలి వైపువెళ్లి ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఎస్‌యూవీలోని 10 మంది, కారులోని ముగ్గురు మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్‌యూవీలోనివారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో కారు బోల్తాపడి ఐదుగురు మృతి చెందారు. 


logo
>>>>>>