గురువారం 28 మే 2020
National - May 17, 2020 , 23:38:07

కరోనా కస్టమర్‌ రాకతో బ్యాంకు ఉద్యోగులకు టెస్టులు

కరోనా కస్టమర్‌ రాకతో బ్యాంకు ఉద్యోగులకు టెస్టులు

హైదరాబాద్‌: నగరంలోని ఒక ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖకు కరోనా పాజిటివ్‌ ఉన్న బాధితురాలు సందర్శించిందని తెలియడంతో ఆ రోజు డ్యూటీలో ఉన్న 13 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఉద్యోగులందరినీ క్వారంటైన్‌కు తరలించినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఓల్డ్‌సిటీలోని పురానాపూల్‌ బ్యాంకులో ఈ ఘటన చోటు చేసుకుంది. 

కరోనా బాధితురాలైన ఒక మహిళ ఎవరెవరిని కలిసిందనే కోణంలో విచారణ జరిపినప్పుడు... తాను బ్యాంకుకు వెళ్లినట్లు ఆమె విచారణలో తెలిపింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ, వైద్యశాఖ, పోలీసు అధికారులు బ్యాంకు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎవరైనా ఉద్యోగికి పాజిటివ్‌ వస్తే వారిని గాంధీ ఆస్పత్రికి తరలించాలని, నెగిటివ్‌ వస్తే 14 రోజుల వరకు క్వారంటైన్‌కు తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 


logo