శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 25, 2021 , 10:02:31

దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 14 వేలపైచిలుకు నమోదవగా, సోమవారం ఉదయం వరకు 13 వేలకు తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 13,203 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,67,736కు చేరింది. ఇందులో 1,84,182 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,53,470 మంది మరణించారు. కరోనా బారినపడినవారిలో 1,03,30,084 మంది బాధితులు కోలుకున్నారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 131 మంది మృతిచెందగా, 13,298 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదేవిధంగా కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా 16,15,504 మందికి టీకా పంపిణీ చేశామని వెల్లడించింది. 

VIDEOS

logo