సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 15, 2020 , 23:02:22

50 ఏండ్ల వ‌య‌సులో 12వ త‌ర‌గ‌తి పాస్‌!

50 ఏండ్ల వ‌య‌సులో 12వ త‌ర‌గ‌తి పాస్‌!

షిల్లాంగ్‌: ‌సాధార‌ణంగా 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసే విద్యార్థులు 17, 18 ఏండ్ల వ‌య‌సువారై ఉంటారు. ఒక‌వేళ లేటుగా స్కూల్‌కు వెళ్లినా మ‌హా అయితే 20 ఏండ్లు ఉంటారు. కానీ ‌మేఘాల‌య‌కు చెందిన ఓ మ‌హిళ మాత్రం 50 ఏండ్ల వ‌య‌సులో 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. మేఘాల‌య‌కు చెందిన లాకింట్యూ సిమ్లే 1988లో ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌చ్చింది. అయితే గ‌ణితం అంటే భ‌యంతో ప‌రీక్ష‌లు రాక‌ముందే మ‌ధ్య‌లో స్కూల్ మానేసింది. 

అనంత‌రం పెండ్లి, పిల్ల‌లు, సంసార బాధ్య‌త‌లు మీద‌ప‌డ్డాయి. దీంతో ఆమె చ‌దువుతో అంత‌టితోనే ఆగిపోయింది. అయితే 2008లో ఆమెకు ప్రీ స్కూల్ పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పే అవ‌కాశం రావ‌డంతో మ‌ళ్లీ పుస్త‌కాలు ప‌ట్టింది. దాదాపు 32 ఏండ్ల విరామం త‌ర్వాత ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షలు రాసి పాసైంది. ఇక‌ ఇప్పుడు ఖాసీ భాషలో బ్యాచిలర్స్ డిగ్రీ చేయాలని భావిస్తున్న‌ట్లు సిమ్లే వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo