సోమవారం 26 అక్టోబర్ 2020
National - Mar 28, 2020 , 23:16:13

లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘ‌న‌..1258 మంది అరెస్ట్

లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘ‌న‌..1258 మంది అరెస్ట్

కేర‌ళ‌: లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తోన్న వారిపై కేర‌ళ పోలీసులు కొర‌డా ఝ‌ళిపిస్తున్నారు. లాక్‌డౌన్ అమ‌వుతున్న స‌మ‌యంలో నియ‌మ‌నిబంధ‌న‌లు పాటించని 1258 మందిని అరెస్ట్ చేశాం. 792 వాహ‌నాలు సీజ్ చేశాం. 5 రోజుల లాక్ డౌన్ టైంలో నిబంధ‌నలు ఉల్లంఘించిన కేసులు మొత్తం 8311 న‌మోదయ్యాయ‌ని కేర‌ళ పోలీస్ ఉన్న‌తాధికారి ఒక‌రు వెల్ల‌డించారు. కేర‌ళ వ్యాప్తంగా పోలీసులు ఎవ‌రి ఇళ్ల‌లో నుంచి బ‌య‌ట‌కు రాకుండా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. మ‌రో వైపు ప్ర‌భుత్వం కూడా ప్ర‌జ‌లంతా స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని  ఎప్ప‌టిక‌పుడు సూచ‌న‌లు చేస్తోంది.  logo