బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 14:20:18

కరోనాతో 102 మంది పోలీసులు మృతి

కరోనాతో 102 మంది పోలీసులు మృతి

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి దెబ్బకు పోలీసులు వణికిపోతున్నారు. పోలీస్‌శాఖలో ఇప్పటి వరకు కరోనా వల్ల    100 మందికి  పైగా మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో మరో 121 మంది పోలీస్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ  అయిందని రాష్ట్ర పోలీస్‌శాఖ తెలిపింది.

ఒక్కరోజు వ్యవధిలో మరో ఇద్దరు చనిపోవడంతో పోలీస్‌ శాఖలో కరోనా మరణాల  సంఖ్య 102కు చేరింది.   ఇందులో 8 మంది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.  ఇప్పటి వరకు మహా పోలీసు డిపార్ట్‌మెంటులో మొత్తం  9217 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో  7,176  మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,939 యాక్టివ్‌ కేసులున్నాయి. 


logo