ఆదివారం 17 జనవరి 2021
National - Nov 24, 2020 , 09:12:05

ఢిల్లీలో ఒకేరోజు 121 మంది క‌రోనా బాధితుల మృతి‌

ఢిల్లీలో ఒకేరోజు 121 మంది క‌రోనా బాధితుల మృతి‌

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న‌ది. వరుసగా నాలుగో రోజూ కరోనా మృతుల సంఖ్య 100 దాటింది. గడచిన 24 గంటల్లో 121 మంది కరోనా బాధితులు మ‌ర‌ణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 8,512 దాటింది. నిన్న కొత్త‌గా 4,454 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసులు 5.34 ల‌క్ష‌లు దాటాయి. ఇందులో 4,88,476 మంది కోలుకోగా, మ‌రో 37,327 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

సోమవారం మొత్తం 37,307 కరోనా టెస్టులు చేయగా, వాటిలో 4,454 పాజిటివ్‌గా తేలింది. దీని ప్రకారం కరోనా సంక్రమణ రేటు 11.94గా ఉందని వెల్లడయ్యింది. ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధికంగా న‌వంబ‌ర్ 11న ఒక్క‌రోజులో 8,593 కేసులు న‌మోద‌య్యాయి.