బుధవారం 27 మే 2020
National - May 16, 2020 , 10:37:36

121మందితో శంషాబాద్‌ చేరిన ప్రత్యేక విమానం

121మందితో శంషాబాద్‌ చేరిన ప్రత్యేక విమానం

హైదరాబాద్‌: వందే భారత్‌ మిషన్‌లో భాగంగా అమెరికా నుంచి 121 మంది ప్రయాణికులతో ఎయిరిండియా విమానం హైదరాబాద్‌లో దిగింది. లాక్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రప్రభుత్వం వందేభారత్‌ మిషన్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల 14 నిమిషాలకు భారతీయ ప్రయాణికులతో నివార్క్‌ (న్యూజెర్సీ) నుంచి వచ్చిన ప్రత్యేక విమానం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగింది. ప్రయాణికులందరినీ పరిశీలించిన తర్వాత అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. 

రెండో విడత వందే భారత్‌ మిషన్‌ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. సుమారు 31 దేశాల్లో ఉన్న సుమారు 30 వేల మంది భారతీయలును 149 ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకురానున్నారు. మొదటి విడత వందే భారత్‌ కార్యక్రమంలో 14,800 మంది భారతీయులకు 64 ప్రత్యేక విమానాల్లో తరలించారు.  


logo