బుధవారం 03 జూన్ 2020
National - May 17, 2020 , 15:38:26

మొత్తం 1206 మంది పోలీసులకు పాజిటివ్..

మొత్తం 1206 మంది పోలీసులకు పాజిటివ్..

ముంబై: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే చాలా మంది పోలీసులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు.

మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 1206 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు ఆ రాష్ట్ర పోలీస్ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 66 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఈ కేసుల్లో 912 యాక్టివ్ కేసులుండగా, 283 కోలుకుని డిశ్చార్జయ్యారు. 11 మంది మృతి చెందారని పేర్కొన్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo