మంగళవారం 07 జూలై 2020
National - May 05, 2020 , 15:51:40

బెంగాల్‌కు చేరుకున్న 12,00 మంది వలసకూలీలు

బెంగాల్‌కు చేరుకున్న 12,00 మంది వలసకూలీలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌కు చెందిన 12,00 మంది వలస కూలీలు స్వస్థలాలకు చేరుకున్నారు. రాజస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న 1,188 మంది ప్రత్యేక రైలులో బయలుదేరి మంగళవారం ఉదయం దంకుని రైల్వేస్టేషన్‌లో దిగారు. వారందరినీ రాష్ట్రంలోని వివిధ క్వారెంటైన్‌ కేంద్రాలకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. దంకుని రైల్వేస్టేషన్‌ నుంచి కూలీలను వారివారి జిల్లాల్లోని క్వారెంటైన్‌ కేంద్రాలకు తరలించడం కోసం 64 బస్సులు, 42 ఇతర వాహనాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అందరినీ 14 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉంచిన తర్వాతనే ఇండ్లకు పంపనున్నట్లు తెలిపారు.  


logo