ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 17:33:27

న‌దిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాల‌కు తెగించి మ‌రీ కాపాడిన ‌ బాలుడు!

న‌దిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాల‌కు తెగించి మ‌రీ కాపాడిన ‌ బాలుడు!

చిన్న‌పిల్ల‌లు నీటిలో మునిగిపోతుంటే పెద్ద‌వాళ్లు కాపాడ‌డానికే ఆలోచిస్తారు. ఎందుకంటే.. వాళ్లు నీటిలో కొట్టుకుపోయేట‌ప్పుడు ఎక్క‌డ వీరిని కూడా లాక్కెళ్లిపోతారో అని. కానీ ఈ బాలుడు మాత్రం అలా చేయ‌లేదు. అలా చేస్తే వారికి నాకు పెద్ద‌గా తేడా లేదు అనుకున్నాడేమో.. 22 ఏండ్ల వ్య‌క్తి వంతెన మీద నుంచి న‌దిలోకి దూకి కాపాడండంటూ అరుస్తున్నాడు. అత‌న్ని కాపాడేందుకు ముందు వెనుక ఆలోచించ‌కుండా స‌న్నీ అనే 12 ఏండ్ల బాలుడు న‌దిలోకి దూకి అత‌న్ని ప‌ట్టుకున్నాడు.

భ‌యంతో అప‌స్మార‌త స్థితికి చేరుకున్న వ్య‌క్తిని బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి సుమారు 15 నిమిషాలు ప‌ట్టింది. కొంచెం దూరం వ‌చ్చిన త‌ర్వాత స్నేహితుడితో అత‌న్ని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చాడు. ఎక్కువ స‌మ‌యం నీటిలోనే ఉండ‌డంతో వ్య‌క్తి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. బాధితుడు హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న‌ట్లు రాంన‌గ‌ర్ స్టేష‌న్ హౌస్ ర‌వి తెలిపారు.


logo