బుధవారం 08 జూలై 2020
National - Jun 24, 2020 , 07:39:33

ఐఎన్‌ఎస్‌ శివాజీలో ట్రెయినీలకు కరోనా పాజిటివ్‌

ఐఎన్‌ఎస్‌ శివాజీలో ట్రెయినీలకు కరోనా పాజిటివ్‌

ముంబై: నౌకాదళంలో కరోనా కలకలం రేపింది. పుణెలోని లోనావాలో ఐఎన్‌ఎస్‌ శివాజీ నౌకలో శిక్షణ పొందుతున్న 12 మంది ట్రెయినీ నావికులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత ఐఎన్‌ఎస్‌ శివాజీలో శిక్షణ కోసం 157 మంది సెయిలర్లు రిపోర్టు చేశారని అధికారులు వెల్లడించారు. అయితే కరోనా నిబంధనల ప్రకారం వారిని 14 రోజుల క్వారంటైన్‌కు పంపించామని చెప్పారు. అందులో ఒక ట్రెయినీకి కరోనా లక్షణాలు కన్పిండంతో జూన్‌ 18న పరీక్షలు నిర్వహించామని, అందులో పాజిటివ్‌గా తేలిందన్నారు. 

దీంతో అతని కాంటాక్టులను గుర్తించామని, వారికి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. మొత్తం 157 మందిలో 12 మందికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. నౌకాదళంలోని ఇతరులకు కరోనా సోకకుండా ముందుజాగ్రత్త చర్యగా పాజిటివ్‌లుగా తేలినవారిని క్వారంటైన్‌ చేశామని అధికారులు వెల్లడించారు.


logo