శనివారం 06 జూన్ 2020
National - May 07, 2020 , 19:10:47

24 గంట‌ల్లో 12 పాజిటివ్ కేసులు..

 24 గంట‌ల్లో 12 పాజిటివ్ కేసులు..

బెంగళూరు: కర్ణాటకలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 705కు చేరుకుంది. వీరిలో 366 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌య్యారు. ఇప్ప‌టివ‌ర‌కు 30 మంది మృతి చెందార‌ని వైద్యారోగ్య శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. 

మ‌రోవైపు క‌ర్ణాట‌క లో ప్ర‌జ‌లు లాక్ డౌన్ నిబంధ‌న‌లు పాటించేలా పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రూల్స్ అతిక్ర‌మించిన వారిపై కేసులు న‌మోదు చేసి, అత్య‌వ‌స‌రం  కాకున్నా రోడ్ల‌పై వ‌స్తున్న వారి వాహ‌నాల‌ను సీజ్ చేస్తున్నారు. 



ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo