సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 18:08:39

12 మందికి కరోనా నెగిటివ్‌.. మళ్లీ 2 గంటల్లోనే పాజిటివ్‌.!

12 మందికి కరోనా నెగిటివ్‌.. మళ్లీ 2 గంటల్లోనే పాజిటివ్‌.!

కశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లోని ఓ కూల్ డ్రింక్స్ ప్లాంట్‌లో పనిచేసే 12 మందికి కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ అని తేలి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్లీ  2 గంటలోనే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని ఓ ప్రభుత్వ దవాఖానలో చోటుచేసకుంది. ఈ 12 మంది రెండు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తొలి సారి నెగిటివ్ అని రావడంతో దవాఖాన సిబ్బంది వారిని ఇంటికి పంపించేశారు. రెండు గంటల తరువాత రెండో కరోనా పరీక్ష ఫలితాలు రాగా అందులో పాజిటివ్ అని తేలింది.

దీంతో వాళ్లు తమకు కరోనా వుందా.? లేదా.? అనే అయోమయంలో పడ్డారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే తాము నడుచుకున్నామని అక్కడి వైద్యులు చెబుతున్నారు.  రెండు గంటల వ్యవధిలోనే నెగిటివ్‌ కాస్తా పాజిటివ్‌ కావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo