సోమవారం 06 జూలై 2020
National - Jun 20, 2020 , 06:48:15

చెన్నైలో 12 రోజుల పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

చెన్నైలో 12 రోజుల పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

చెన్నై: కరోనా కట్టడికి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంతోపాటు శివారు జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ప్రారంభమైంది. పోలీసులు డ్రోన్లతో పరిస్థితులను పర్యవేక్షిస్తూ, పెట్రోలింగ్‌ ఉద్ధృతం చేశారు. నిత్యావసర దుకాణాలు కూడా మూసివేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ ప్రజలను హెచ్చరించారు.  

చెన్నైతోపాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాల్లో కూడా పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో రాజధాని నగరంతోపాటు, మూడు జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు జూన్‌ 15న ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 52,334 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క చెన్నై నగరంలోని మూడో వంతు పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. 


logo