12,638 వ‌జ్రాల‌తో రింగు.. గిన్నిస్ రికార్డు

Dec 05, 2020 , 13:16:30

హైద‌రాబాద్‌:  సుమారు 12,638 వ‌జ్రాలు క‌లిగి ఉన్న ఓ రింగు తాజాగా గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.  పువ్వు ఆకారంలో ఉన్న ఆ రింగును 'ద మారీగోల్డ్‌-ద రింగ్ ఆఫ్ ప్రాస్ప‌రిటీ'గా పిలుస్తున్నారు.  ఆ రింగు బ‌రువు సుమారు 165 గ్రామ‌లు ఉన్నది. 25 ఏళ్ల హ‌ర్‌సిత్ బ‌న్సాల్ ఈ రింగును డిజైన్‌ చేశారు.  ఆ రింగును త‌యారు చేయ‌డం త‌న డ్రీమ్ ప్రాజెక్టు అని అత‌ను తెలిపాడు. ఇలాంటి వ‌జ్రాల రింగు త‌యారు చేయాల‌ని రెండేళ్ల క్రితం ఐడియా వ‌చ్చింద‌న్నాడు.  క‌నీసం ప‌దివేల డైమండ్ల‌తో రింగ్ డిజైన్ చేయాల‌నుకున్న‌ట్లు బ‌న్సాల్ తెలిపాడు. ఎనిమిది వ‌రుస‌ల్లో చాలా ప్ర‌త్యేక‌మైన శైలిలో రింగ్‌ను డిజైన్ చేశారు. కానీ రింగును అమ్మేందుకు త‌న‌కు ఇష్టంలేద‌న్నాడు.  

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD