శనివారం 30 మే 2020
National - Mar 31, 2020 , 13:02:31

క‌ర్ణాట‌క‌లో 12,000 న‌కిలీ మాస్కుల సీజ్‌

క‌ర్ణాట‌క‌లో 12,000 న‌కిలీ మాస్కుల సీజ్‌

బెంగ‌ళూరు: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను ఇప్ప‌టికే ముప్పుతిప్ప‌లు ప‌డుతున్నా.. మోసాల‌కు మ‌రిగిన కొంద‌రు అక్ర‌మార్కులు మాత్రం త‌మ‌ దొంగ‌బుద్ధిని మానుకోవ‌డంలేదు. తాజాగా క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో ఒక ముఠా.. ఎన్‌95 మాస్కుల పేరుతో న‌కిలీ మాస్కుల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తున్న‌ట్లు తెలిసి పోలీసులు రైడ్ చేశారు. నిందితులు అమ్మ‌కానికి సిద్ధం చేసిన‌ 12,000 మాస్కుల‌ను సీజ్ చేశారు.

స్థానికులు ఇచ్చిన స‌మాచారంతో తాము బెంగ‌ళూరులోని న‌కిలీ మాస్క్‌ల త‌యారీ సంస్థ‌పై దాడి చేశామ‌ని, గోదాములో నిలువ ఉన్న 12,000 న‌కిలీ మాస్కుల‌ను సీజ్ చేశామ‌ని బెంగ‌ళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీస్ క‌మిష‌నర్ సందీప్ పాటిల్ తెలిపారు. సాధార‌ణ వ‌స్త్రంతో త‌యారు చేసిన మాస్కుల‌ను నిందితులు ఎన్‌95 మాస్కుల పేరుతో ఎక్కువ ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం నిందితులు ప‌రారీలో ఉన్నార‌ని, వారి కోసం గాలిస్తున్నామ‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ చెప్పారు.     logo